Lok Sabha: లోక్ సభలో అమిత్ షా- అఖిలేష్ యాదవ్ మధ్య వాగ్వాదం

by Shamantha N |
Lok Sabha: లోక్ సభలో అమిత్ షా- అఖిలేష్ యాదవ్ మధ్య వాగ్వాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఇరువురి మధ్య వాడీవేడీగా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వాగ్వాదం జరిగింది. బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అఖిలేష్ యాదవ్ సెటైర్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోంది’’ అని బీజేపీ ఉద్దేశించి చురకలు అంటించారు. అఖిలేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. అమిత్ షా కూడా ఆ ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం చెప్పారు. అంతేకాకుండా, ప్రదాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపైనా అఖిలేష్ యాదవ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. "ఎవరో తన కుర్చీని కాపాడుకోవడానికి 75 సంవత్సరాల పరిమితిని పొడిగించడానికి యాత్ర చేశారు" అని మోడీని ఉద్దేశించే అన్నారు.

అమిత్ షా కౌంటర్..

కాగా.. అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా దీటుగా బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ..‘‘అఖిలేశ్‌జీ నవ్వుతూ ఓ విషయం చెప్పారు. నేను కూడా చిరునవ్వుతోనే సమాధానం ఇస్తాను. కొన్ని పార్టీల నాయకత్వం ఐదుమంది చేతుల్లో ఉంటుంది. దీంతో ఆ ఐదుగురి నుంచే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ మేం ఒక ప్రక్రియను పాటించాలి. 12 నుంచి 13 కోట్ల పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. అందుకు సమయం పడుతుంది. మీకు సమయం పట్టదు. ఎందుకంటే మరో 25 ఏళ్లు మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు’’ అని బదులిచ్చారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed