ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపుడి..

by Sumithra |
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపుడి..
X

దిశ, హుజూర్ నగర్ : అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎంపీ ఉత్తమ్ కు సవాల్ విసిరారు. మూడు సంత్సరకాలంగా ఎంత అభివృధి జరిగిందో చర్చకు మేము సిద్దం.. కాంగ్రెస్ పార్టీ తరుపున మీరు సిద్దమా అని అన్నారు. పట్టణంలోని గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణా సంక్షేమ సంబరాలలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మూడు సంత్సరాల కాలంగా హుజూర్ నగర్ నియోకవర్గస్థాయిలో రూ. 3,500/-కోట్ల రూపాయలతో అభివృధిలో ముందుకు సాగుతుంది అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని సీఎం కేసీఆర్ పాలనలో ఆన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

కళ్యాణ లక్ష్మీ, షాధీ ముబారక్ చెక్కుల పంపిణీ పూర్తి స్ధాయిలో పారదర్శకంగా నడుస్తున్న పథకం ప్రతి నిరుపేద ఇంట్లో వెలుగులు నింపే పథకాలు ఎన్నోఉన్నాయని అన్నారు. అవన్నీ కూడా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ విసిరుతున్న వారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిధులు ఎన్ని తెచ్చానో బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడు ఓట్లు సీట్లే తప్ప ప్రజా సంక్షేమం గురించి వారికి అవసరం ఉండదు అన్నారు.

వారి కుటుంబీకులకు సీట్లు ఇప్పించు కోవడంలో తప్ప ప్రజలకు ఏం చేద్దామనే ముందస్తు ప్రణాళిక వారికి ఉండదు అని కాంగ్రెస్, బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా 24 గంటల పాటు రైతుకు నిరంతర విద్యుత్ అందించడం లేదని అన్నారు. రైతు సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం అన్నారు. బీఆర్ఎస్ పాలన అంటే ప్రజాసంక్షేమ పాలన అని దేశ వ్యాప్తంగా కూడా అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహీశీల్దార్లు వజ్రాల జయశ్రీ, కార్తీక్, ఎంపీపీలు మూడవత్ పార్వతి, గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed