- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అసాధ్యం
దిశ ,సూర్యాపేట కలెక్టరేట్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ అసాధ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు భారత ఎన్నికల ప్రక్రియలో మళ్ళీ పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చిందని దీనిపై ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుపై (EVM) పిటిషనర్ డాక్టర్ కౌల్ చేసిన వాదనల్లో ఎటువంటి వాస్తవాలు లేవని న్యాయస్థానం పేర్కొందన్నారు. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీ.బీ. వరాలేల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించిందన్నారు. ఈ తీర్పులో “పోలిటికల్ పార్టీలు ఈవిఎంలపై విజయం సాధించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవిఎంలు తారుమారైనట్లు ఆరోపణలు వస్తాయన్నట్లు పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు ఈవిఎంలపై ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు, పిటిషనర్‌కు మాత్రమే సమస్య ఉందని న్యాయమూర్తి విక్రమ్ నాథ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. సుప్రీం కోర్టు తుది నిర్ణయంగా పేపర్ బ్యాలెట్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలని చేసిన అభ్యర్థనను తిరస్కరించిందన్నారు.