- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధైర్య పడకండి.. అండగా ఉంటాం: ఏపూరి సోమన్న
దిశ, తుంగతుర్తి: కష్టాలు ఎదురైనప్పుడే ధైర్యంగా ముందుకు సాగాలని వైయస్సార్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఏపూరి సోమన్న పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చీకటి మల్లయ్యకు చికిత్స నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే అనారోగ్యంతో మృతి చెందిన చింతకుంట లక్ష్మి కుటుంబానికి రూ.5 వేలు, చింతకుంట లాలయ్య కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పేదలకు అన్ని రకాలుగా సహాయాలు అందిస్తూ వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద వర్గాలను ఆదుకోవడంలో కలిగే తృప్తి మరెందులో కూడా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్, నాయకులు ఏపూరి యాకన్న, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, జలగం కళ్యాణ్, మందుల యాదగిరి, మాచర్ల గణేష్, చింతకుంట్ల నగేష్, ముత్యం రవి, మేకల నాగయ్య, సాంబయ్య, వెలుగు అంజయ్య, సంద వెంకన్న, గాజుల సురేందర్, ఉపేందర్, చింతకుంట్ల శ్రీను, దిలీప్ నాయుడు, మందుల రాము, రిషి ప్రేమ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు