'కన్జ్యూమర్లను విద్యుత్ అధికారులు ఇబ్బంది కలిగించవద్దు'

by samatah |
కన్జ్యూమర్లను విద్యుత్ అధికారులు ఇబ్బంది కలిగించవద్దు
X

దిశ, నేరేడుచర్ల /హుజూర్‌నగర్ : విద్యుత్ వినియోగించే కన్జ్యూమర్లను విద్యుత్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సక్రమంగా విద్యుత్ సరఫరా అందించాలని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం - 1 చైర్మన్ దిలీప్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణంలోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కై సీజీఆర్ఎఫ్ చైర్మన్ దిలీప్ కుమార్ బోర్డు టెక్నికల్ నెంబర్ పి. నాగేశ్వరరావు ఎస్ఈ బాలరాజు సమక్షంలో నిర్వహించారు . విద్యుత్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్జ్యూమర్లు వారి పరిష్కారానికై వారి సమస్యలను విన్నయించుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీజీఆర్ఎఫ్ చైర్మన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ కన్జ్యూమర్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సీజీఆర్ఎఫ్ సెంటర్లు ఏర్పడ్డాయని అన్నారు . కన్జ్యూమర్ ఏ సమస్యలున్నా మొదటగా సీఈఎస్ సబ్ డివిజన్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని అన్నారు.ప్రతి సమస్య పరిష్కారానికి కాలపరిమితి ఉంటుందని ఆ సమస్య కాలపరిమితిలో అధికారులు సమస్యలను పరిష్కరించాలని అన్నారు . ఆ సమస్యను అధికారులు పరిష్కరించకపోతే సీజీఆర్ఎఫ్ ను కన్జ్యూమర్లు ఆశ్రయించవచ్చినని అన్నారు. విద్యుత్ ఆఫీస్ నుండి రిపోర్ట్ తీసుకుంటామని విద్యుత్ అధికారుల నుండి కన్జ్యూమర్స్ నుండి స్టేట్మెంట్ తీసుకొని విచారణ చేపడతామని అన్నారు. ఈ రిపోర్టులో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వహించినట్లు తెలిస్తే అధికారులకు జరిమానా విధిస్తామని తెలిపారు. కన్జ్యూమర్లకు న్యాయం జరగకపోతే హైమ మ్యుడ్ మాన్ కూడా వెళ్లవచ్చునని తెలిపారు.ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో కలిపి ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 650 ఫిర్యాదులు అందాయని అందులో 500 పైగానే పరిష్కారం జరిగాయని అన్నారు . ఫిర్యాదులలో వ్యవసాయపరంగా సమస్యలే ఎక్కువ ఉన్నాయని తెలిపారు. రైతులు పంట పొలాల చుట్టూ విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడం వలన ఈ ప్రమాదాలలో పశువులతో పాటు మనుషులు కూడా మృత్యువాత పడుతున్నారని ఇలాంటి చేయడం నేరమని అన్నారు. ఈ సమావేశంలో హుజూర్‌నగర్ సూర్యాపేట డిఈలు వెంకట కృష్ణయ్య , శ్రీనివాసులు ఏడీఈలు సక్రు నాయక్ ,వెంకన్న ,రవికుమార్ ఏఈలు శ్రీనివాస్ ,నరసింహ నాయక్ ,నగేష్ పాల్గొన్నారు ..

ఫోరంకు ఫిర్యాదు చేయతగు సమస్యలు

1.విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చు అంతరాయం

2. విద్యుత్ హెచ్చు తగ్గు సమస్యలు..

3.విద్యుత్ మీటరు సమస్యలు.

4.విద్యుత్ బిల్లులలోని సమస్యలు.

5.కొత్త సర్వీసులు ఇచ్చుటకు నిరాకరించిన లేక ఆలస్యం చేసినా..

6.యాజమాన్య బదిలీ సర్వీసులో మార్పు..

7. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

8. ట్రాన్స్ ఫార్మర్ల మార్పిడి

9. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇతర సమస్యలు ఏవైనా కావచ్చు.

ఈ క్రింద ఫోరం చిరునామకు రాతపూర్వకముగా మీ సర్వీసు కనెక్షన్ నెం., గ్రామము, మండలము, జిల్లా, ఫిర్యాదుల వివరములు పోస్ట్ ద్వారా గాని, వ్యక్తిగతముగా గాని ఇవ్వవచ్చును

ఫిర్యాదు చేయవలసిన చిరునామ.

కన్సూమర్ గ్రీవెన్సస్ రిడ్రైవల్ ఫోరమ్ -1టిఎస్ఎస్ పిడిసిఎల్

ఇంటి నెం. 8-6-16-7/14, టిఎస్ఎస్ పిడిసిఎల్

సినీస్టోర్స్ ఎదురుగా, జి.టి.యస్. కాలనీ,

ఎర్రగడ్డ, హైదరాబాద్-45

ఫోన్ :040-23431431, 23431438

Advertisement

Next Story

Most Viewed