ఆత్మీయ సమ్మెళనంలో మాజీ ఎమ్మెల్యే పట్ల వివక్ష...

by Sumithra |   ( Updated:2023-04-09 16:14:56.0  )
ఆత్మీయ సమ్మెళనంలో మాజీ ఎమ్మెల్యే పట్ల వివక్ష...
X

దిశ, మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలోని విజయ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణుల మధ్య సమన్వయం లోపించినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఫోటోను ఫ్లెక్సీలో పెట్టకపోవడం ఆయన వర్గానికి ఆగ్రహం తెప్పించింది. తన వర్గం వారికే ఆత్మీయసమ్మేళనం స్టేజ్ పైన పెద్దపీట వేయడం కర్నె ప్రభాకర్ వర్గాన్ని దూరం పెట్టడం, ఫ్లెక్సీలో ఆయన ఫోటో పెట్టకపోవడంతో ఆయన వర్గం వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని నాయకులంతా సమన్వయంతోటి పనిచేయాలని సూచించారు. కానీ కుక్కతోక వంకర అన్న విధంగా మునుగోడు ఎమ్మెల్యే తీరుమారకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తిరుగండ్ల పల్లి, యరగాండ్లపల్లి, మర్రిగూడ, వట్టిపల్లి, దామెర బిమనపల్లి ఎంపీటీసీల పరిధిలో బీఆర్ఎస్ కుటుంబ కార్యకర్తలు "దిశ"ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొని పాటలు పాడుతూ బీఆర్ఎస్ కుటుంబాలను అలరించారు. ఉపఎన్నికలో ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులకు ముందు వరుసలో ప్రాధన్యతను ఇచ్చి వారికీ పెద్దపీటవేస్తూ పాతవారికి. ఎన్నికల్లో కస్టపడి గెలుపు కోసం పనిచేసిన వారికీ కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం పై పలువురు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికల సందర్భంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతోనే ఉంటానని చెప్పి మళ్లీ గెలిచాక పాత ధోరణిలో వెళ్ళడం ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కార్యకర్తలకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తనగెలుపు కోసం మాజీఎమ్మెల్సీ సీనియర్ నాయకులు కర్నెను వాడుకొని ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు పిలవక పోవడం పై కర్నే వర్గం తీవ్రవిమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ చెప్పిన విధంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తనతీరు మార్చుకోక పాత పద్ధతినే అవలంబిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఇలానే కొనసాగితే పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story