- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అభివృద్ధి పనులు ఉండాలి : మునుగోడు ఎమ్మెల్యే

దిశ,చండూరు : మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులను భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మున్సిపాలిటీ లో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు.మున్సిపాలిటీకి కనెక్ట్ అయ్యే వివిధ గ్రామాల లింకు రోడ్లను 60ఫిట్లకు వరకు విస్తరించాలని అన్నారు.మున్సిపాలిటీ రోడ్డు వెడల్పు లో భాగంగా విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ వెంటనే చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ కు తెలిపారు.డివైడర్ పనులను పరిశీలించి వాటిలో పచ్చగడ్డి ల్యాండ్ తో పాటు చెట్లు పెట్టే విధంగా నిర్మాణం చేపట్టాలని అన్నారు.
చండూరు పట్టణ సెంటర్లో వాణిజ్య భవనాల వద్ద రోడ్డు వెడల్పు ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో పరిశీలించారు.చండూరు బస్టాండ్ నుండి కనగల్ వైపు శివారు ప్రాంతం వరకు చేపట్టిన రోడ్డు డివైడర్ పనులను పరిశీలించి పలుమార్పులను సూచించారు..రోడ్డు డివైడర్ మధ్యలో పచ్చగడ్డి లాన్ తో పాటు అందమైన చెట్లను పెంచేలా నిర్మాణం జరగాలన్నారు.భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోడ్డు వెడల్పు పనులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి చండూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు అనంత చంద్ర శేఖర్ గౌడ్, కోరిమి ఓంకారం,నాయకులు దోటి వెంకటేష్ యాదవ్, కోడి శ్రీనివాసులు, పల్లె వెంకన్న, అబ్బానబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
- Tags
- munugodu mla