భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే వేముల

by Disha Web Desk 11 |
భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే వేముల
X

దిశ, నకిరేకల్ టౌన్ : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఓటర్లను కోరారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేక అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తుందని మండిపడ్డారు. మతకల్లోలలతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరించి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed