- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని.. విద్యుత్ డీఈ కార్యాలయం ముట్టడి
24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని.. విద్యుత్ డీఈ కార్యాలయం ముట్టడి
X
దిశ, మిర్యాలగూడ: రైతులకు 24గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ డీఈ కార్యాలయం ముట్టడి చేశారు. అనంతరం రోడ్డు పై బైటాయించి మాట్లాడారు. విద్యుత్ కోతలతో వరి పొలాలకు సాగు నీరు అందడం లేదని, మోటర్ల సాయంతో నీటి సరఫరా చేస్తున్న పొలాలు ఎండి పోతున్నాయని పేర్కొన్నారు.
24గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం 12 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో పొట్ట దశలో ఉన్న పొలాలు ఎండి పోతున్నాయన్నారు. 24 గంటల విద్యుత్ ఇచ్చి నీటి విడుదలలో వారబంది తొలగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Next Story