తల్లిదండ్రుల మధ్య విభేదాలు... పిల్లల పాలిట శాపంగా మారిన వైనం

by Disha Web Desk 11 |
తల్లిదండ్రుల మధ్య విభేదాలు... పిల్లల పాలిట శాపంగా మారిన వైనం
X

దిశ, గరిడేపల్లి : తల్లిదండ్రుల మధ్య విభేదాలు పిల్లల పాలిట శాపంగా మారిన సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయిని గూడెం గ్రామంలో జరిగింది. బాలల పరిరక్షణ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన చింతలచెరువు సతీష్,లక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి మధ్య విభేదాలు తలెత్తడంతో తల్లి పిల్లలను తండ్రి వద్దే వదిలేసి వెళ్లిందని తెలిపారు.

దీంతో తండ్రి మద్యానికి బానిసై పిల్లలను పట్టించుకోకపోవడంతో ఆ పిల్లల బాగోగులు వారి నాయనమ్మ రామ తిలకం చూసుకుంటుందని తెలిపారు. రామ తిలకం కూడా వృద్ధురాలు కావడం, తన మానసిక స్థితి బాగలేకపోవడం, దిక్కుతోచని స్థితిలో పిల్లలను ఊరూరూ త్రిప్పి భిక్షాటన చేయిస్తూ జీవనాన్ని సాగిస్తుందని అన్నారు.

కాగా మంగళవారం ఉదయం వారి నాయనమ్మ పిల్లలను భిక్షాటన చేయిస్తుండగా గ్రామస్తులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. వారు రాయినిగూడెం చేరుకొని పిల్లలను సూర్యాపేట బాల సదనానికి తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారులు రవి కుమార్, సాయి త్రిలోక్, మీరా, అంగన్వాడి టీచర్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed