- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భువనగిరిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..వారికి ఫోన్‌లో పలు ఆదేశాలు..

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణం హనుమాన్ వాడలోని 7 వార్డులో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలిసి బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలతో వార్డు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలతో రోజు కృష్ణ వాటర్ సరిపోను వస్తున్నాయ లేదో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఆరా తీశారు. ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డు లు వచ్చాయా, రేషన్ బియ్యం వస్తున్నాయా అని ప్రశ్నించారు. నరసింహ అనే వ్యక్తికి రూ.500 లకి గ్యాస్ వస్తుందా అని అడిగారు.
రాలేదని చెప్పడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లై అధికారికి కాల్ చేసి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నారా లేదా అని అడిగారు.. రాని వారికి సంబంధిత యస్ఈకి వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపించి ఉచిత కరెంట్ వచ్చే విధంగా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఎంక్వయిరీ కి వచ్చారా లేదా అని అడిగారు. రాని వారికి ఆర్పీ ద్వారా కొత్త అప్లికేషన్ చేయించాలని సూచించారు. స్థానిక మహిళలు కోరిక మేరకు కొత్తగా వాటర్ ట్యాంక్ ని నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. స్థానిక దేవాలయం వెనుక ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి పూల మెక్కలు లాంటివి పెట్టి గార్డెన్ లాగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. కాలనీ లో స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలనీలో మురికి కాల్వలు శుభ్రం గా ఉంచాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.