- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొండి బకాయిల వసూలు వేగవంతం చేయాలి.. అడిషనల్ పీడీ
by Sumithra |

X
దిశ, అనంతగిరి : మహిళా సంఘాల సభ్యులు రుణాలను సకాలంలో చెల్లించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ పీడీ సురేష్ కుమార్ సూచించారు. మొండి బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ఈ నెల 25వ తారీకులోపు వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతగిరి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో శనివారం సీసీఎస్ వివోఏఎస్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రుణాలు తీసుకున్న వారు తప్పనిసరిగా ప్రతి నెల సక్రమంగా చెల్లిస్తేనే గ్రామీణ ప్రాంతాలలోని సమభావన సంఘాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. లోన్లు సైతం మరింత అధిక శాతం పెంచుకునే అవకాశం ఉందని, సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని తప్పనిసరిగా బకాయిలు చెల్లించి ప్రభుత్వానికి ఆర్థిక తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల ఏపీఎం లక్ష్మి పలు గ్రామాల వివోఏలు, సీసీఎస్, ఎస్ఎన్ మేనేజర్ పాల్గొన్నారు.
Next Story