- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నిహిత సంబంధమే హత్యకు కారణం: డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి
దిశ, మునగాల: మండల పరిధిలోని నెలమర్రి గ్రామంలో బచ్చలకూరి మదార్ పై బచ్చలకూరి సంజీవ్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. తన చిన్నమ్మ రామాంజమ్మతో మదార్ సన్నిహితంగా ఉండడమే అందుకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. సోమవారం మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మృతుడు మదార్ అదే గ్రామానికి చెందిన బచ్చలకూరి సంజీవ్ కు వరుసకు చిన్నమ్మైన రామాంజమ్మతో సన్నిహితంగా ఉంటున్నాడు.వారిద్దరి ప్రవర్తన వల్లే తమకు వయసు వచ్చినా.. పెళ్లిళ్లు కావడం లేదని, ఇక నుంచి తన చిన్నమ్మ వద్దకు రావొద్దని మదార్ ను సంజీవ్ హెచ్చరించాడు.
అయినా, మదార్ తీరు మారలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సంజీవ్ 16న రాత్రి మదార్ చర్చి బజారు నుంచి వస్తుండగా చూసిన సంజీవ్ కర్రతో మదారుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గమనించిన స్థానికులు సంజీవ్ ను పట్టుకొని ఆపారు. అప్పటికే స్పృహ కోల్పోయిన మదార్ ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. 17న మదార్ చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు నిందితుడు సంజీవ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. నిందితుడుని చాకచక్యంగా పట్టుకున్న సీఐ ఆంజనేయులు, ఎస్ఐ లోకేష్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
- Tags
- murder