మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం : ఎమ్మెల్యే

by Sumithra |
మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం : ఎమ్మెల్యే
X

దిశ, చిట్యాల : ఈ నెల 30న జరగనున్న ఎన్నికల పోలింగ్ లో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 100 స్థానాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావడంతో పాటు ఎన్నో ప్రాజెక్ట్లను నిర్మించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడు లాగా అభివృద్ధి, సంక్షేమం పై దృష్టి పెట్టి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాడన్నారు.

కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేదేమీ లేదని, ఆ పార్టీ ఇచ్చే నమ్మశక్యం కాని హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నేరచరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని ఎన్నో అక్రమాలకు, బెదిరింపులకు, హత్య రాజకీయాలకు పాల్పడడం వల్లే ప్రజలు విసుకు చెంది 2018 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుఇవ్వాలని కోరారు. ఎప్పుడు ప్రజలమధ్య ఉంటూ, ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి, ప్రజలతో మమేకమై పనిచేసే తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, ఎంపీపీ కొలను సునీత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story