- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతీయ మైనారిటీస్ కమిషన్ సభ్యురాలి వ్యక్తిగత సహాయకుడి మీద దాడి..
దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమం కోసం పర్యవేక్షణ కోసం ఏర్పరచిన సమావేశంలో అనూహ్య సంఘటన జరిగింది. ఈ సమావేశంలో స్థానిక మైనార్టీల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జాతీయ మైనర్టిస్ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాజాది సాహెబా పలువురు సమస్యలు వింటున్న సమయంలో ఊహించని రీతిలో సమావేశం రసాభాసగా మారింది. ఆ తరుణంలో నల్లగొండ జిల్లా ఎఐఎంఐఎం అధ్యక్షులు రజియుద్దీన్ మాట్లాడుతుండగా చిన్నపాటి తోపులాట జరగడంతో ఆయన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు వ్యక్తిగత సహాయకుడు రాజేష్ కుమార్ మీద చేయి చేసుకున్నారు. వెంటనే భద్రత సిబ్బంది అలర్ట్ అయ్యి అక్కడి వారిని బయటకు పంపివేశారు.
జిల్లా పర్యటనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులు అందరూ ఫిఫ్టీన్ పాయింట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమం కోసం ఏర్పరచిన సమావేశంలో రజియుద్దీన్ అనే వ్యక్తి తన వ్యక్తిగత అసిస్టెంట్ మీద దాడి చేశారు. మైనార్టీల అభివృద్ధి జరగొద్దు అని ఆయన ప్లాన్ ప్రకారం దాడి చేసిండు అది ఒక కలెక్టర్ కార్యాలయంలో ఇలాంటి దాడి చేయడం హేయమైన చర్య, అందుకే అతని మీద కేసునమోదు చేయాలని పిర్యాదు చేశారని తెలిపారు. తాను చాలా బాధపడుతున్న, తన స్వంత రాష్ట్రమైన తెలంగాణాలో తనపై ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగుతుంది అనుకోలేదన్నారు. దేశంలో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా తనకు ఇలాంటి అవమానం ఎదురుకాలేదు అని ఆమె అన్నారు. ఈ సంఘటన విషయం జిల్లా ఎస్పీకి తెలిపానన్నారు. ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టిది లేదు అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉన్న తన మీద ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అన్నారు. అక్కడే ఉన్న పోలీస్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు.