తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి

by Naveena |
తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి
X

దిశ,భూదాన్ పోచంపల్లి: వరంగల్ సభలో రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు రామస్వామి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీ ని దగ్ధం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో మల్లన్న పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నోముల నాగిరెడ్డి, ఏనుగు సంజీవ రెడ్డి, సహాయ కార్యదర్శి కోమిరెల్లి శేఖర్ రెడ్డి, కోశాధికారి కేసారం కొండల్ రెడ్డి, కందాడి భూపాల్ రెడ్డి, సామల మల్లారెడ్డి, ఏనుగు కిషన్ రెడ్డి, బొక్క బాల్ రెడ్డి, సామల రాజిరెడ్డి, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, నోముల బస్వారెడ్డి ,రామిడి పాండు రెడ్డి, సామల సుధాకర్ రెడ్డి, రామిడి యాదిరెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి,సద్దిపల్లి నవీన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, సుదీర్ రెడ్డి, అశ్విన్ రెడ్డి, సత్తిరెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed