బోర్డు తిప్పేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ.. రూ.200 కోట్లతో ఉడాయించిన కేటుగాళ్లు

by Shiva |
బోర్డు తిప్పేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ.. రూ.200 కోట్లతో ఉడాయించిన కేటుగాళ్లు
X

దిశ, నల్లగొండ బ్యూరో: అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది ఉద్యోగులు ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.కోట్లు డిపాజిట్ చేశారు. కానీ, రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. టెస్కాబ్ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ లేడి అధికారి కుటుంబ సభ్యుడు ప్రైవేటు ఫైనాన్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే, అందులో ఫిక్స్ డిపాజిట్లు చేయాల్సిందిగా టెస్కాప్ అధికారి తన కింది ఉద్యోగులను, సహచరులను, కోరింది. అయితే, ఆమె మీద ఉన్న నమ్మకంతో టెస్కాబ్‌లో పని చేస్తున్న ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాలు చేరిన వాళ్లు, ప్రమోషన్ కోసం ఆశపడుతున్న ఉద్యోగులకు, కార్యాలయంలో అందరికీ అన్ని పనులు చేసి పెడతానని చెప్పింది. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రైవేట్ ఫైనాన్స్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పింది.

దీంతో నమ్మిన ఉద్యోగులంతా సుమారు రూ.200 కోట్లకు పైగా ఆ ప్రైవేటు ఫైనాన్స్ డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తోంది. డబ్బు మొత్తం జమ అయ్యాక ఆ అధికారి కూడా పరారైనట్లుగా తెలుస్తోంది. గత 15 రోజులుగా ఆమె విధులకు హాజరుకాకుండా ఉన్నప్పటికీ సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఆ విషయాన్ని దాచిపెడుతున్నట్లుగా సమాచారం. అసలు విషయం ఏంటంటే.. ఆ ఉన్నతాధికారికి సంబంధించిన సొమ్ము కూడా సుమారు రూ.1.50 కోట్లు ఆ ఫైనాన్స్ కంపెనీల పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉన్నత స్థాయిలో అధికారిని నమ్మి రూ.కోట్లు డిపాజిట్లు చేస్తే నమ్మించి మోసం చేసిందని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే విషాయన్ని ఎవరూ బయటకు చెప్పుకోలేక లోపల దాచుకోలేక మదన పడుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed