- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు.. భారీగా పెరిగిన సందర్శకులు
దిశ, నాగార్జునసాగర్, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద వస్తుండటంతో పది గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువన ఉన్న సాగర్ కు వదులుతున్నారు.దీంతో కేవలం వారం రోజుల్లో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో సోమవారం ఉదయం ఆరు గేట్లను ఎత్తిన అధికారులు 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా రాత్రి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండటంతో 10 గేట్లను ఎత్తారు. అయితే మంగళవారం తెల్లవారుజాము వరకు శ్రీశైలం నుంచి వరద ఉధృతి అధికంగా ఉండటంతో అప్రమత్తమైన అధికారులు సాగర్ 20 గేట్లను ఎత్తారు. ఇందులో 4 గేట్లు 5 ఫీట్లు, 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ కు ఇన్‌ఫ్లో 3,00,530 క్యూసెక్కులు. క్రస్ట్ గేట్ల ద్వారా ఔట్ ఫ్లో 2,54,460 క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.80 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. మరోవైపు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు ప్రస్తుతం 296.85 టీఎంసీలకు నీరు చేరుకుంది.