- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
'ములుగు గట్టమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి'

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు గట్టమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆదివాసి నాయకపోడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ అన్నారు. ఈ మేరకు ఆధ్వర్యంలో ములుగు అదనపు కలెక్టర్ గణేష్ మరియు ఆర్డీవో రమాదేవికి సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సమావేశంలో ఆదివాసి నాయకపోడ్ రాష్ట్ర అధ్యక్షుడు మెషినేని రాజన్న మాట్లాడుతూ.. ఆదివాసులుగా పుట్టడం మన అదృష్టమని ఆదివాసి హక్కుల కోసం మనం కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు. అలాగే గట్టమ్మ దేవాలయ పరిసర ప్రాంతాలలో సత్రాలు ఏర్పరిచి గట్టమ్మ దేవతను దర్శించుకునే భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పరచాలని అన్నారు. ఆదివాసి నాయకపొడ్ గట్టమ్మ పూజారులకు కొబ్బరికాయలు, పూజ సామాగ్రి పసుపు, కుంకుమ, ప్రసాదం వంటి షాపులు పూజారులకు టెండర్‌తో సంబంధం లేకుండా కేటాయించాలన్నారు.
అలాగే ప్రతి సంవత్సరం ఎదురు పిల్ల పండగ కోసం గతంలో కేటాయిస్తున్న దానికంటే రూ.2 లక్షలు అధనంగా ఇవ్వాలన్నారు. గట్టమ్మ దేవాలయం వద్ద నిత్య పూజలు చేస్తున్న ఆదివాసీ నాయకపోడ్ పూజారులకు వసతి భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసులు ఎవరు కూడా ఆదివాసి కులాన్ని వదిలి వేరే మతంలోకి మారకూడదని, మారినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం, కుల కట్టుబాట్లు ప్రకారం ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని కలెక్టర్‌కి విజ్ఞప్తిచేశారు. అనంతరం ములుగు మండల ఎమ్మార్వో సత్యనారాయణకి గట్టమ్మ పూజారులు మరియు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి సన్మానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంజి రాజన్న, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భీమ్రావు, మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సది అరిగెల సమ్మయ్య, కొత్త రమేష్ ,ఆకుల రాజు, చిర్ర మహేష్, చిర్రా మహేందర్ ,కొత్త సారయ్య, కొత్త రవి ,ఆకుల రఘు తదితరులు 20 మందికి పైగా పాల్గొన్నారు.