- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోడీ కులంపై CM రేవంత్ కామెంట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత చెబుతున్న రేవంత్ రెడ్డి.. ముందు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ది ఏ కులమో చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లందరూ చరిత్రలో కలిసిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతగానితనం కనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఉందా? అని ప్రశ్నించారు.
సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. అసలు మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ కేబినెట్‌లో 17 మంది బీసీ మంత్రులు ఉన్నారని.. రేవంత్ రెడ్డి కేబినెట్(Revanth Reddy Cabinet)లో ఉన్నది ఇద్దరే ఇద్దరు బీసీ మంత్రులు అని ఎద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మోడీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని రేవంత్ రెడ్డి ఇప్పుడే కనిపెట్టినట్లు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని సెటైర్ వేశారు.
అంతకుముందు గాంధీ భవన్(Gandhi Bhavan)లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు. ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం అని చెప్పారు. 2002లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని ఓసీ నుంచి బీసీల్లో చేర్చుకున్నారు. ఆయన బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలే అని అన్నారు.