తెలంగాణను పాలించే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదు: ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-11-05 11:23:51.0  )
తెలంగాణను పాలించే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదు: ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుందని నల్లగొంగ కాంగ్రెస్ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్ని్కల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కలిసి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను దోచుకున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story