ముఖ్యమంత్రి రేస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి?

by GSrikanth |   ( Updated:2023-05-23 12:49:22.0  )
ముఖ్యమంత్రి రేస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేస్ లో తాను లేనని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఆయన అనూహ్యంగా తన పుట్టిన రోజు సందర్భంగా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంటే ముఖ్యమంత్రి కుర్చీ వారిదేనని హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుందో అందరికీ తెలుసని అన్నారు. రేపు తెలంగాణలోనూ అలాంటి నిర్ణయమే ఉండబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వర్గ విభేదాలు ఏమీ లేవని అందరం కలిసిపోయామన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70-80 సీట్లు వస్తాయని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కూడా కాంగ్రెస్సే అని ధీమా వ్యక్తం చేశారు.

అనుచరుల నినాదల వెనుక భారీ వ్యూహం?:

ఇవాళ వెంకట్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో నార్కెట్ పల్లిలో ఘనంగా బర్త్ డే వెడుకలు సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు వెంకట్ రెడ్డి సీఎం అంటూ చేసిన నినాదాలు వైరల్‌గా మారాయి. అయితే ఇదంతా వెంకట్ రెడ్డి బలప్రదర్శన అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. గతానికి భిన్నంగా ఈసారి వెంకట్ రెడ్డి వేడుకలు పెద్ద ఎత్తున జరగడం ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు సీఎం అభ్యర్థిగా తమ నేతనే అంటూ స్లొగన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ స్లొగన్స్ యాదృచ్ఛికంగా తమ నేతపై అభిమానంతోనే ఇలా చేశారా లేక దీని వెనుక వెంకట్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా అనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని ఇటీవల వెంకట్ రెడ్డి పిడుగులాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేస్‌లో తాను లేనని అన్నారు. తాజాగా కావాలనుకుంటే సీఎం అదే వస్తుందని ఆసక్తికరంగా రియాక్ట్ కావడం టీకాంగ్రెస్ లో చర్చగా మారింది. తన అనుచరుల స్లొగన్స్ పై స్పందించిన వెంకట్ రెడ్డి నినాదాలు ఇస్తే ముఖ్యమంత్రులు కాలేరని ప్రజలు ఎన్నుకుంటే అవుతారని బదులిచ్చారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఫలితాలతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వెంకట్ రెడ్డి మనసు మార్చుకున్నారా అనే సందేహాలు తాజా పరిణామాలతో అర్థం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించబోతున్న:

తన బర్త్ డే వేడుకలతో పాటు బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ కు కృష్ణ నీరు రావడం, కరోనా సమయంలో తన కూతురు వివాహానికి ఎవరిని ఆహ్వానించలేదని అందువల్ల ఇవాళ తన అనుచరులందరం కలిశామని వెంకట్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, ఎంపీగా ఓ సారి గెలిచిన తాను స్వరాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని అలాంటి తనకు ప్రజా సేవ కంటే సీఎం పదవి ముఖ్యం కాదన్నారు. తనకు స్టార్ క్యాంపెయినర్ అనే పదవి చాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ముఖ్య పాత్ర పోషించోతున్నట్లు చెప్పారు.

Also Read..

కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. ఇకపై నెలకు రెండు సార్లు ఆమె తెలంగాణకు వచ్చేలా ప్లాన్!

Advertisement

Next Story

Most Viewed