- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేవంత్ రెడ్డికి పోయేకాలం దగ్గర పడింది.. MP ఈటల షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి పోయేకాలం దగ్గర పడిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ(PM Modi)ని తిడితే ఏం జరుగుతుందో కేసీఆర్‌కు తెలిసింది.. త్వరలో రేవంత్ రెడ్డికి కూడా తెలుస్తుందని అన్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు మోడీని పెద్దన్న అంటారు.. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ హామీలిన్ని ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్(Job calendar) లేదు. రైతు భరోసా లేదు. రుణమాఫీ సరిగా కాలేదు. పెంచిన పింఛన్లు ఇవ్వడం లేదు. మహిళలకు రూ.2500 ఇవ్వడం లేదు. గ్యాస్ డబ్బులు అకౌంట్లలో పడటం లేదు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీల్లో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ తప్ప ఏదీ అమలు కావడం లేదని అన్నారు.
కాగా, అంతకుముందు గాంధీ భవన్(Gandhi Bhavan)లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోంది. అసలు మోడీ బీసీనే కాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోడీ పుట్టుకతోనే ఉన్నత కులం.. 2002లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారని ఆరోపించారు. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ సహా రాష్ట్ర బీజేపీ ప్రముఖ నేతలంతా కౌంటర్స్ ఇస్తున్నారు.