కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధానిని కలిసిన MP ఈటల

by Gantepaka Srikanth |
కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధానిని కలిసిన MP ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)తో తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. ఈ నేసథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రాజకీయ వర్గాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి(Telangana BJP President)గా ఈటల పేరు ఖరారు అయినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. అందుకే అధిష్టానం పెద్దల ఆశీర్వాదాలకు వెళ్లారని చర్చించుకుంటున్నారు. కాగా, ఈ పోస్ట్ కోసం ధర్మపురి అర్వింద్, మాధవనేని రఘునందన్ రావుతో పాటు పలువురు నాయకులు ప్రయత్నం చేయగా.. అధిష్టానం మాత్రం ఈటలవైపే మొగ్గు చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈటలకు ఇస్తే బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని బీజేపీ అగ్రనాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇటీవల తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మల్క కొమురయ్య(Teachers MLC), అంజిరెడ్డి(Graduate MLC)లు ఎమ్మెల్సీలుగా గెలుపొందారు.

Next Story