పేదల భూములనే ఆక్రమిస్తారా.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటల కన్నెర్ర..

by Bhoopathi Nagaiah |
పేదల భూములనే ఆక్రమిస్తారా.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటల కన్నెర్ర..
X

దిశ, ఘట్కేసర్ : పేదల భూములను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తగిన బుద్ది చెప్పారు. బీదల భూములను ఆక్రమిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సదరు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌‌పై దాడికి పాల్పడ్డారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో ఏకశిలా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి హాజరైన ఎంపీ ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకశిలా వెంచర్‌లో ప్లాట్లను సందర్శించే క్రమంలో గొడవ తలెత్తింది. ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అనుమానస్పదంగా కనిపించడంతో బీజేపీ కార్యకర్తలు, ఏకశిలా ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అనుచరులతో కలిసి గుర్తుతెలియని వ్యక్తులపై దాడికి దిగారు. ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కింద పడేసి కాలుతో తన్నుతూ గాయపరిచారు. బీజేపీ కార్యకర్తలు దాడిని తప్పించుకున్న ఆ వ్యక్తులు బయటికి పరుగు తీశారు. దాడి జరుగుతుండగా అడ్డుకునే క్రమంలో ఎంపీ ఈటల ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్ సంస్థలో బ్రోకర్‌గా తెలుస్తోంది. కాగా, దాడిలో పారిపోయిన వారంతా కూడా భూ కబ్జాదారుడి అనుచరులని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story