- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS వివేకా హత్య వెనుక అతడిదే కుట్ర: సంచలన విషయాలు బయటపెట్టిన MP అవినాష్ రెడ్డి
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సోమవారం వరకు ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాష్‌రెడ్డిని విచారించే సమయంలో దర్యాప్తు అధికారి పారదర్శకంగా వ్యవహరించటం లేదన్న అభియోగాలు ఉన్నాయన్న కోర్టు, కేసుకు సంబంధించి మొత్తం రికార్డులు, ఫైళ్లను న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును జోరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీఐబీ అధికారులు నోటీసులు ఇవ్వటం ద్వారా శుక్రవారం మరోమారు సీబీఐ కార్యాలయానికి పిలిపించుకున్నారు. అయిదు గంటలపాటు సుధీర్ఘంగా ప్రశ్నించారు.
ఒకరోజు ముందే..
కాగా, సీబీఐ విచారణకు రావటానికి ఒకరోజు ముందే అవినాష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను విచారించకుండా స్టే మంజూరు చేయాలని అందులో కోరారు. జనవరి 28, ఫిబ్రవరి 24వ తేదీల్లో ఆడియో, వీడియో రికార్డింగ్లేకుండా తన నుంచి తీసుకున్న వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. ఈ వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. సీబీఐ జరిపే విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్మధ్య జరపాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
విచారణ సందర్భంగా తన న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థించారు. విచారణ సందర్భంగా తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇవే అంశాలపై అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తునకు తన క్లయింట్అవినాష్రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నట్టు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. గతంలో అవినాష్‌రెడ్డి నుంచి తీసుకున్న రెండు వాంగ్మూలాలను పక్కకు పెట్టాలని కోరారు. సీబీఐ అధికారులు గతంలో రెండుసార్లు ఆడియో, వీడియో రికార్డింగ్లేకుండానే అవినాష్‌రెడ్డిని విచారించారని తెలిపారు.
విచారణ అనంతరం అవినాష్‌రెడ్డి సంతకాలు తీసుకోలేదని వివరించారు. అవినాష్‌రెడ్డి వాంగ్మూలాలను దర్యాప్తు అధికారి అయిన సీబీఐ ఎస్పీ రాం సింగ్పలుమార్లు ఎడిట్చేశారని పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి సంతకాలు తీసుకోని నేపథ్యంలో ఆయన వాంగ్మూలాలను మార్చి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయనఅల్లుడు రాజశేఖర్‌రెడ్డి హస్తం ఉందన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో ఏం చెప్పదలుచుకున్నారో ఆ వివరాలను మధ్యాహ్నం 2.30 గంటలకు తెలియచేయాలని సీబీఐ అధికారులకు సూచించింది.
సీబీఐ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయన్న అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది మాటలను ప్రస్తావిస్తూ కెమెరాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. గతంలో కోడి కత్తి కేసులో ఎయిర్‌పోర్టులో ముప్పయి సీసీ కెమెరాలు పనిచేయటం లేదంటూ సీఐఎస్ఎఫ్కోర్టుకు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడా పరిస్థితి అలానే ఉందా అని ప్రశ్నించింది. ఇక, వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లేఖను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ సీబీఐకి ఉత్తర్వులు ఇచ్చింది.
సిద్దంగా ఉన్నాం: సీబీఐ ఎస్పీ
అవినాష్‌రెడ్డి విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఇప్పటికిప్పుడు కోర్టుకు సమర్పించటానికి సిద్ధంగా ఉన్నట్టు సీబీఐ ఎస్పీ రాంసింగ్న్యాయస్థానానికి తెలియచేశారు. కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడా? సాక్షినా? అని కోర్టు అడిగిన ప్రశ్నకు బదులుగా తాము 160 సీఆర్‌పీసీ సెక్షన్‌ప్రకారం నోటీసులు ఇచ్చి ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. సాక్షిగా పరిగణించినా విచారణలో వెల్లడయ్యే వివరాలను బట్టి అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ఈ కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను అరెస్టు చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సోమవారం అవినాష్‌రెడ్డిని మరోసారి విచారిస్తామని తెలిపారు. ఆ రోజు హైకోర్టులో విచారణ ఉంది కదా అని కోర్టు వ్యాఖ్యానించగా మంగళవారం విచారణ చేస్తామని తెలియచేశారు.
ఇకపై మౌనంగా ఉండను: అవినాష్‌రెడ్డి
ఇన్నాళ్లూ వివేకానందరెడ్డి హత్య కేసులో మౌనంగా ఉన్నానని, ఇకపై అన్ని విషయాలపై మాట్లాడుతానని అవినాష్‌రెడ్డి చెప్పారు. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డిది మర్డర్ఫర్గెయిన్అని అన్నారు. ఆయన ఓ ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఆమెకు పుట్టిన కొడుకుని రాజకీయ వారసునిగా ప్రకటించాలని వివేకానందరెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో రాజకీయ వారసత్వంతో పాటు ఆస్తులు కూడా దక్కకుండా పోతాయని వివేకానందరెడ్డి కూతురు సునీత భర్త అయిన రాజశేఖర్హత్యకు కుట్ర చేసినట్టుగా నాకు అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి లెటర్‌ను మాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టు తాను ఎవరితోనూ చెప్పలేదన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ చిత్రీకరణ అని చెప్పారు. వివేకానందరెడ్డి హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. నాపై వివేకానందరెడ్డి కూతురు సునీత ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసిందని, తాను మాత్రం ఏ ఒక్కరోజూ ఎవ్వరి గురించి మాట్లాడలేదని చెప్పారు. నేను హైకోర్టులో లంచ్మోషన్పిటిషన్దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతకు సమాచారం ఇచ్చి కేసులో ఇంప్లీడ్అయ్యేలా పిటిషన్దాఖలు చేయించారన్నారు. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి చెంచల్‌గూడ జైల్లో రిమాండ్ఖైదీలుగా ఉన్న ముగ్గరు నిందితులతోపాటు దస్తగిరి, గంగిరెడ్డి నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు.