తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. గడీల దొరసానిలా ఉంది. షాకింగ్ కామెంట్స్ చేసిన దాసోజు శ్రవన్

by Pooja |
తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. గడీల దొరసానిలా ఉంది. షాకింగ్ కామెంట్స్ చేసిన దాసోజు శ్రవన్
X

దిశ, వెబ్ డెస్క్; తెలంగాణ తల్లి విగ్రహం(Statue of Telangana Mother) తెలంగాణ తల్లిలా లేదని, గడీల దొరసానిలా ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావన్(Dasoju Shravan) మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది చరిత్రను అపహాస్యం చేయడమే అని ఓ మీడియా ఇంటర్యూలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు శాడిస్టు, సైకోపాత్‌లా ఉందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ద్వారా తెలంగాణ ఉద్యమ ఆత్మను దెబ్బతీయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చర్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. కేంద్రంలో మోదీ(Modi) ప్రభుత్వం సింహాల రూపాన్ని మార్చినప్పుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారని, అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కూడా కాంగ్రెస్ నేతలు స్పందించాలని శ్రావణ్ అన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం అంటే కేవలం శిల్పం మాత్రమే కాదని, అది ఉద్యమ చరిత్రకి, ఆత్మ గౌరవానికి నిదర్శనం అని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే బతుకమ్మ, ధూమ్ ధామ్ వంటి ప్రతీకలు తెలంగాణ ఉద్యమానికి ఆత్మ ప్రతిబింబాలని వెల్లడించారు. వాటి పరిరక్షణకు ప్రతీ తెలంగాణ వాసి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మన చరిత్ర, సంస్కృతి, ఆత్మ గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వాధినేతల ప్రధాన బాధ్యత అని శ్రవణ్ గుర్తు చేశారు.

Next Story

Most Viewed