వైద్యులపై ఇతర శాఖ అధికారుల మానిటరింగ్ సరి కాదు: తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్

by Shiva |
వైద్యులపై ఇతర శాఖ అధికారుల మానిటరింగ్ సరి కాదు: తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వైద్యులపై ఇతర శాఖ అధికారుల మానిటరింగ్ సరి కాదని తెలంగాణ టీచింగ్ గవ్ట్ డాక్టర్స్ అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్, డాక్టర్ కిరణ్​ మాదాలలు మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే తమపై ఇలా ఒత్తిడికి గురి చేయడం సరి కాదన్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ కోసం రోజుకు ఒక ఇతర డిపార్ట్‌మెంట్ అధికారులను రోస్టర్ పద్ధతిలో వేసి, రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు చాల అసమంజసంగా, అసంబద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ ఉత్తర్వులను వైద్య ఉద్యోగుల నైతికతను ప్రశ్నించినట్లుగా తెలపారు. ఇలాంటి వాటితో వైద్యులు, వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని తెలిపారు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంటు‌పై ఇలా ఇతర విభాగాల అధికారులు పర్యవేక్షణ చేసి రిపోర్ట్ పంపడం అనేది అత్యంత శోచనీయం అని అన్నారు. ఇదే అంశంపై శుక్రవారం నల్లగొండ కలెక్టర్‌తో చర్చించామని పేర్కొన్నారు. దీంతో రోస్టర్, వైద్యుల సమస్యలు, మౌలిక వసతులు, తదితర అంశాపై చర్చించామని తెలిపారు.



Next Story