Mohan Babu: దైవసాక్షిగా కొట్టాలనుకోలేదు.. దాడి ఘటనపై మోహన్ బాబు ఆడియో రిలీజ్

by Prasad Jukanti |   ( Updated:2024-12-12 13:11:32.0  )
Mohan Babu: దైవసాక్షిగా కొట్టాలనుకోలేదు.. దాడి ఘటనపై మోహన్ బాబు ఆడియో రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో ఆసుపత్రిలో చేరిన నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరుకున్న మోహన్ బాబు జరిగిన పరిణామాలపై తాజాగా మరో ఆడియో విడుదల (Audio Message) చేశారు. 11 నిమిషాల నిడివి కలిగిన ఆడియోలో జర్నలిస్టుపై దాడి ఘటనపై తన వివరణ ఇచ్చారు. 'అభిమానులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా నమస్కారాలు. గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతుందో అందరికీ తెలుసు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరికైనా జోక్యం చేసుకోవచ్చా?. అందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. నటులు, పాపులర్ అయిన రాజకీయ నాయకుల విషయాలు కొంత మంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెబుతుంటారు. అలా చెప్పేవాళ్లకు ఫ్యామిలీ ఉంటుందని ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలు కొంత మంది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను జర్నలిస్టులు కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదు. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు జర్నలిస్టులా కాదా నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకుని నాపై దాడి జరగొచ్చని ఆలోచించా. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు బాధపడుతున్నాను. దెబ్బ తగిలిన మీడియా ప్రతినిధి నాకు తమ్ముడి లాంటివాడు. మీడియా ప్రతినిధి భార్యాబిడ్డల గురించి ఆలోచించాను. నా భాద గురించి ఎవరూ ఆలోచించలేదు. నేను సినిమాల్లో నటిస్తాను తప్ప.. నిజ జీవితంలో కాదు. గేటు బయట కొట్టి ఉంటే నాపై 100 కేసులు పెట్టి నన్ను అరెస్టు చేయవచ్చు. నా ఇంట్లోకి వచ్చి ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. అయినా అతడు నా కన్నబిడ్డే. ఏదో ఓ రోజు న్యాయం జరుగుతుంది. కుటుంబ సమస్యల మధ్య గొడవకు మధ్యవర్తులు అక్కర్లేదు. కూర్చుని మేము మాట్లాడుకుంటాం. నేను కొట్టింది తప్పు కానీ సందర్భాన్ని అర్థం చేసుకోండి. 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మీడియా ఉండటం ఎంత వరకు న్యాయం. మీకు టీవీలు ఉన్నాయి. మాకు టీవీలు లేవు. రేపు నేను కూడా టీవీ పెట్టవచ్చు. అది గొప్ప కాదు. జర్నలిస్టుల్లో కొందరు మహిళా జర్నలిస్టులు కొట్టడం తప్పే అయినా ఏ సందర్భంలో కొట్టారో చెప్పారు. కానీ అది మీరెవరు చెప్పడం లేదు. నా ఇంటి తలుపులు బద్దలు కొట్టిలోపలికి రావొచ్చా మీరే చెప్పాలంటూ సందేశం పంపించారు.

Advertisement

Next Story

Most Viewed