‘తెలంగాణలో మోడీ పాలన రావాలి’

by Sathputhe Rajesh |
‘తెలంగాణలో మోడీ పాలన రావాలి’
X

దిశ, మక్తల్: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ పాలనతోనే సాధ్యమని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని నేతాజీ నగర్‌లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రజా గోస - బీజేపీ భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్‌ను తాలూకా ఇన్చార్జి కర్ని స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మక్తల్ నియోజక వర్గ ప్రబారి సుభాష్ చందర్, జి. జలంధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు ప్రత్యేక తెలంగాణతో సాధ్యమని రెండుసార్లు అధికారంలో వచ్చిన కేసీఆర్ ధోకా చేశారని మూడోసారి అధికారంలో రావడానికి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని దానికి బీజేపీ అడ్డుకోబోతోందన్నారు.

దానికి రాష్ట్ర ప్రజలు సహకారం అందించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా పేద మధ్యతరగతి ప్రజలు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినాలని ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్న ఘనత మోడీకే దక్కిందన్నారు. ఇల్లు లేని పేదవారికి ఇళ్ళు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల రాష్ట్రానికి నిధులు ఇచ్చిందని కానీ పేద ప్రజలను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు.

మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉన్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తుంటే అడుగ డుగునా అధికార పార్టీ నాయకుడు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు.

నిరుద్యోగులకు భృతి ఇస్తానని, ఉద్యోగాలను భర్తీ చేస్తానని 2018 లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. కానీ నేటికీ అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రాములు, వర్కూర్ ఆంజనేయులు, మహేష్, సి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story