CBI విచారణను వ్యతిరేకిస్తూ కోర్టులో కవిత పిటిషన్

by GSrikanth |
CBI విచారణను వ్యతిరేకిస్తూ కోర్టులో కవిత పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించించారు. ఈ మేరకు కోర్టులో కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా శనివారం పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిస్తూ నిన్న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నితీష్ రాణా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని స్పష్టం చేశారు. కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత న్యాయవాది కోర్టును కోరారు.

కవిత పిటిషన్‌పై ఎప్పుడు విచారణ జరుపుతామో నేడు తెలుపుతామన్న కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఇటీవల కవితపై ఈడీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలున్నాయని.. ఢిల్లీ కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేయడంతో పాటు దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంతేకాదు అప్రూవర్‌గా మారిన వ్యక్తిని బెదిరించారని.. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించినట్లు ఈడీ వాదించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story