- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే MLC Kavita అరెస్ట్: KA Paul సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరికొందరు దొరుకుతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయబోతున్నట్లు తనవద్ద సమాచారం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేఏ పాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో అవినీతి తారా స్థాయికి చేరిందని విమర్శించారు.
అంతర్జాతీయ మీడియా సంస్థలపై అనవసరంగా దర్యాప్తు సంస్థలను ఉపయోగించకూడదని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కోరుతున్నానన్నారు. ఐటీ దాడులు బీబీసీపై ఎందుకు జరిగాయి? అని ప్రశ్నించిన ఆయన.. బీబీసీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, భారత మీడియా సంస్థల లాగా అంతర్జాతీయ మీడియా నోరు మూయించలేరని, వాటిని కనీసం కొనుగోలు కూడా చేయలేరని ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయ మీడియాలతో యుద్ధం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నానన్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలే అంతర్జాతీయ మీడియాను తట్టుకోలేక పోయారని, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారని సూచించారు. మరోవైపు, కేంద్రాన్ని ఎదిరించి నిలబడ్డ ఎన్టీఆర్ లాంటి మహా నాయకులు నేడు లేరని అన్నారు.
ఇప్పుడు ఉన్న నాయకులు, సీఎంలు నరేంద్రమోడీకి బానిసలేనని, ఆయనను ఎదిరించి నిలబడే ధైర్యం లేదని అన్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్ దళిత, బడుగు బలహీన వర్గాల ద్రోహి అని విమర్శించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ పుట్టినరోజు అయిన ఏప్రిల్14వ తేదీన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జన్మదినం రోజున తెలంగాణ సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్కు 72 గంటల అల్టిమేటం జారీ చేస్తున్నానన్నారు.
Also Read...
CM కేసీఆర్కు బిగ్ షాక్.. తిరిగి BJP గూటికి చేరే యోచనలో కీలక నేత..?