- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC కవిత అరెస్ట్.. విచారణాధికారితో KTR, హరీష్ రావు వాగ్వాదం..!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారుల బృందం.. దాదాపు కవిత ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించింది. అనంతరం అరెస్ట్ వారెంటీ జారీ చేసి ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచారం. కవిత అరెస్ట్ విషయాన్ని అధికారులు ఆమె కుబుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ క్రమంలో కవిత ఇంటికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా విచారణ అధికారితో కేటీఆర్, హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తరలిస్తారని అధికారిని ప్రశ్నించారు. కవిత పిటిషన్ విచారణ ముగిసే వరకు అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు తర్వాత కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అరెస్ట్ చేసేందుకు కావాలనే శుక్రవారం వచ్చారని ఆరోపించారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన అధికారులపై మండిపడ్డారు. ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే.. అరెస్టు అని చెప్పడం పైన కేటీఆర్, హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆమె నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. ఓ వైపు కవితను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ, ఈడీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
Read More..
Breaking: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆ ఫ్లైట్‌లోనే ఢిల్లీకి తరలింపు