MLC కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-18 04:31:41.0  )
MLC కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మండలిలో తాము అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. మూసీ(Musi) విషయంలో సభను మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు(World Bank)ను మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. 2024 సెప్టెంబర్‌లో ప్రపంచబ్యాంకును మూసీ కోసం రుణం అడిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. బయటపెడతానని కీలక ప్రకటన చేశారు. ‘డీపీఆర్ లేదని అసెంబ్లీలో చెబుతారు.. ప్రపంచబ్యాంకుకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో ప్రపంచ బ్యాంకు కు డీపీఆర్ ఉందని చెబుతారు. ఎందుకు అబద్ధం చెబుతున్నారు. ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారు’ కవిత ప్రశ్నించారు.

ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మూసీ కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.14 వేల కోట్లు అడిగారని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందని అన్నారు. మూసీ ప్రాజెక్టుపై అబద్దాలు ఆడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. స్పష్టత వచ్చేదాకా పోరాడుతామని ప్రకటించారు.

Next Story

Most Viewed