- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియా క్లిప్ వ్యవహరంపై టీ-కాంగ్రెస్ లో దుమారం చెలరేగింది. తాజాగా వెంకట్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే పదవులు పొందిన వెంకట్ రెడ్డి.. మునుగోడు ఎలక్షన్ లో ఎవరు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవబోదని చెప్పడం కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని ఫైర్ అయ్యారు. గెలుపు ఓటముల విషయం పక్కన పెడితే మునుగోడులో పార్టీ కోసం పని చేయాల్సిన కనీస బాధ్యత వెంకట్ రెడ్డిపై ఉందని అన్నారు. ప్రచారానికి రమ్మంటే తమ్ముడు పోటీలో ఉన్నాడని, మానసిక ఒత్తిడిలో ఉన్నానని ఏదేదో చెప్పిన వెంకట్ రెడ్డి ఇవాళ పార్టీకి భిన్నంగా మాట్లాడుతున్న తీరు సహించేది కాదని అన్నారు. మునుగోడులో వాస్తవ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఉండి నేను గమనిస్తున్నానని, నిజానికి ఐదేళ్ల కోసం మునుగోడు ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి అహంకారానికి పోయి ఉప ఎన్నిక తీసుకువచ్చారని దుయ్యబట్టారు.