MLC Campaign: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..

by Shiva |
MLC Campaign: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ (Election Commisison) ఆదేశాల మేరకు ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఈనెల 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియనుండడంతో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో అభ్యర్థులు అప్పుడే ప్రలోభాల పర్వానికి తెర లేపనున్నారు. ప్రధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉండటంతో ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాలు బలపర్చిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్‌ రోజు వరకు ఓటర్లకు అందుబాటులో ఉండి ఓట్లు రాబట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో 25,797 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) తమ అభ్యర్థిని బరిలో నిలపగా, కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీలు న్యూట్రల్‌గా ఉన్నాయి. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సిటింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (Alugubelli Narsireddy) మరోసారి యూటీఎఫ్‌ (UTF) నుంచి, టీపీఆర్టీయూ (TPRTU) వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌ రెడ్డి (Harshavardhan Reddy), పీఆర్‌టీయూ-టీఎస్‌ నుంచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి (Sripal Reddy), బీజేపీ నుంచి సర్వోత్తమ్‌రెడ్డి (Sarvotham Reddy), బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ (Pula Ravinder)సహా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రుల స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం కొనసాగునుంది. అదేవిధంగా బల్క్ ఎస్‌ఎంఎస్‌‌లపై కూడా ఈసీ నిషేధం విధించింది. పోలింగ్‌ ముగిసే వరకు ఎన్నికల నిబంధనల ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. ఈ మేరకు 48 గంటల పాటు ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ జిల్లాలో మద్యం దుకాణాలు బంద్‌ మూతపడనున్నాయి.

Next Story

Most Viewed