వాళ్లను అరెస్ట్ చేయకపోతే హోటల్‌కు నిప్పు పెడతాం.. న్యూ ఇయర్ వేళ రాజాసింగ్ సంచలనం (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-06-02 16:29:50.0  )
వాళ్లను అరెస్ట్ చేయకపోతే హోటల్‌కు నిప్పు పెడతాం.. న్యూ ఇయర్ వేళ రాజాసింగ్ సంచలనం (వీడియో)
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బిర్యానీ విషయంలో కస్టమర్లు, హోటల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అబిడ్స్‌ గ్రాండ్ హోటల్‌లో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా ధూల్ పేట్‌కు చెందిన కొందరు బిర్యానీ తినటానికి హోటల్‌కు వచ్చారు. మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, మటన్ ఉడకలేదని వెయిటర్లతో గొడవ పడ్డారు. వివాదం చిలికి చిలికి గాలివానగా మారటంతో వెయిటర్లు కర్రలతో దాడికి దిగారు.

విచక్షణారహితంగా కొట్టటంతో కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ యాజమాన్యంపై అబిడ్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, దాడి చేసిన వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలిసి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తక్షణమే హోటల్ యజమానితోపాటు దాడి చేసిన అందరినీ అరెస్ట్ చెయ్యాలని ఆబిడ్స్ స్టేషన్ సీఐని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.


Advertisement

Next Story

Most Viewed