Rajaiah Vs Kadiam Srihari: కడియంపై మరోసారి MLA రాజయ్య సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:11 July 2023 7:02 AM  )
Rajaiah Vs Kadiam Srihari: కడియంపై మరోసారి MLA రాజయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మాటల యుద్ధం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయిన ఇరువురు నేతలు ‘తగ్గేదేలే’ అంటున్నారు. అయితే తాజాగా మంగళవారం ఎమ్మెల్సీ కడియంపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డిని కలిశాడని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని కలిసి వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్లు అడిగారని రాజయ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజయ్య కామెంట్లతో మళ్లీ స్టేషన్‌ఘన్‌పూర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. అయితే ఇటీవల కడియం శ్రీహరి ఎస్సీ కాదు.. బీసీ అని రాజయ్య ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై బహిరంగ చర్చకు రావాలని రాజయ్య కడియంకు సవాల్ విసిరారు.

రాజయ్యకు ప్రగతిభవన్ నుంచి పిలుపు

కడియం శ్రీహరిపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. రాజయ్య తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చి కలవాలని మంత్రి కేటీఆర్ రాజయ్యకు సూచించారు. వరుస వివాదాలు, తీవ్ర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్యను వివరణ కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది.

Read more:

MLA Rajaiah : రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు

నాకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Next Story

Most Viewed