ఏదైనా ఇష్యూ జరిగితే తప్ప స్పందించరా?: రాజాసింగ్

by GSrikanth |
ఏదైనా ఇష్యూ జరిగితే తప్ప స్పందించరా?: రాజాసింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు బలితీసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల కాటుతో బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. వీధి కుక్కల బెడద నుంచి హైదరాబాద్ ప్రజలను, పిల్లలను కాపాడాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నా చర్యలు తీసుకోకుండా, అసలు జీహెచ్ఎంసీ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. గతంలోనూ ఇటువంటి కేసులు నమోదయ్యాయని.. ఏదైనా ఇష్యూ జరిగితేనే స్పందించి ఆ సమయానికి చర్యలు తీసుకోని తర్వాత దులిపేస్తున్నారని మండిపడ్డారు.

దీనిపై మంత్రి కేటీఆర్, హైదరాబాద్ కమిషనర్ స్పందించాలని కోరారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో పిచ్చి కుక్కలు తిరిగితే పిల్లలు, వృద్ధులు బయల ఎలా తిరగాలని నిలదీశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇకనైనా స్పందించి కుక్కలను అడవుల్లో వదిలేయాలని అన్నారు. అంతేకాకుండా, వీధి కుక్కలపై ఒక టీం ఏర్పాటు చేయాలని..వాటిపై తగిన చర్యలు తీసుకుని అడవుల్లో వదిలేయాలని రాజాసింగ్ మంగళవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed