అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కుమార్తె అరుపులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యేలు..!

by Satheesh |
అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కుమార్తె అరుపులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యేలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ప్రారంభం కాగానే ఎమ్మెల్యేగా ఎన్నికైనవారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి స్పీకర్ ముందుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా మీడియా గ్యాలరీ నుంచి ‘‘ఐలవ్యూ డాడీ’’ అంటూ ఒక్కసారిగా అరుపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ ఉలిక్కిపడింది. నిన్ననే పార్లమెంట్‌లో పొగ బాంబుదాడి జరిగిన విషయం తెలిసిందే.

ఇప్పటికే నిఘా సైతం కట్టుదిట్టం చేశారు. అయితే గ్యాలరీ నుంచి పెద్ద అరుపు రావడంతో ఏం జరుగుతుందో తెలియక సభ్యులు సైతం అటూఇటూ చూశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కౌశిక్ రెడ్డి కుమార్తెను గ్యాలరీ నుంచి విజిటర్స్ గ్యాలరీకి తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి కుమార్తెను మీడియా గ్యాలరీకి ఎందుకు అనుమతి ఇచ్చారని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

Advertisement

Next Story