- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kaushik Reddy: ఆ బాంబులు ఎప్పుడు పేలుతాయా అని ఎదురుచూస్తున్నాం

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి లోపు తెలంగాణలో రెండు, మూడు బాంబులు పేలుతాయని.. పలువురు కీలక నేతలు జైలుకు వెళ్లక తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) స్పందించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ దాడుల్లో దొరికిన రూ.700 కోట్ల గురించి చెబుతాడా? అని ప్రశ్నించారు. ముందు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పొంగులేటి ఎప్పుడు బాంబ్ పెడతారో అని వేచి చూస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ లేదని విమర్శించారు. జగిత్యాలలో స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) హత్య చేయించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) చెప్తున్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌పై జగిత్యాల ఎస్పీ ఎందుకు మర్డర్ కేసు నమోదు చేయడం లేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం గంగారెడ్డిని హత్య చేయించారని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హత్యా రాజకీయాలను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. తానింకా కాంగ్రెస్‌లో చేరలేదని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు. చేరకుండానే గాంధీ భవన్‌లో జరిగే కాంగ్రెస్ మీటింగ్‌కు ఎందుకు హాజరయ్యారు? సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎందుకు పాలాభిషేకం చేశారు? అని అడిగారు. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉంటే రాష్ట్రంలో మర్డర్లు జరుగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మొత్తం బయటపెడతాము. కరీంనగర్ జిల్లాలో 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోశారు. గంగారెడ్డిని హత్య చేసి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బహుమతి ఇచ్చిందని కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.