- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ ఆదేశాలతో రివ్యూ చేసిన మిషన్ భగీరథ అధికారులు
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతం అమ్రాబాద్, లింగాల, పదరా మండలాల పరిధిలో ఉన్న వివిధ ఆదివాసి చెంచు గుడాలల్లో నెలకొన్న త్రాగునీరు, వైద్యం, విద్య, వ్యవసాయం, భూమి హక్కు పత్రాలు, శాశ్విత నివాసాలు, క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారుల ద్వారా ఎదురవుతున్న అనేక ఇబ్బందులు, రెవిన్యూ అటవి భూములకు ఆర్ఓ ఎఫ్ఆర్ఓ పట్టాలు కాకుండా రెవిన్యూ హక్కు పత్రాలు ఇవ్వాలని, వ్యవసాయం చేసుకునేందుకు కాడెద్దులు, విత్తనాలు ఎరువులు మంజూరు చేయాలని, ఇతర విషయాలపై సోమవారం ఆదివాసి సంఘాల నాయకులు, ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆర్ డబ్ల్యూఎస్, ఇతర జిల్లా డివిజన్ స్థాయి అధికారులతో వెంటనే ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. ఆదివాసి గుడాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ఆదివాసి గుడాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కదిలారు.
రివ్యూ సమావేశం ...
ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాలతో మంగళవారం మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా ఎస్ఈ వెంకట్ రమణ మన్ననూర్ జిల్లా ఈఈ శ్రీదర్, డీఈ హేమలత, ఏఈ సందీప్, మధు, ఆదివాసి పెద్దలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి రివ్యూ సమావేశంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలం, లింగాల మండలాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో ఉన్న 15 ఆదివాసి చెంచు గుడాల్లో గల మంచినీటి సౌకర్యం, కలుగుతున్న సమస్యలు, వాటి పరిష్కారం, తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.
తదుపరి అమ్రాబాద్ మండలం రాయలేటి పెంటను అధికారులు క్షేత్ర పరిశీలన చేసి తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. చెంచు హాబిటేషన్ ప్రాంతాలలో స్పెషల్ ఫోకస్ పెట్టి అధికారులు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్యామ్నాయ ఏర్పాటుచేసి తాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
మల్లాపూర్, అప్పాపూర్, వటర్లపల్లి, సార్లపల్లి చెంచు కాలనీలతో పాటు రాంపూర్‌పెంట, మేడిమొలకలపెంట, సంగిడి గుండాల, కుడి చింతలబైలుపెంటలలో సోలార్ బోరు మోటర్ మరమ్మత్తులు, చేతిపంపులు ఏర్పాటు చేసేలా సమావేశంలో చర్చించారు.
రూ. 18 లక్షలు విడుదల..
క్షేత్ర పరిశీలన అనంతరం మిషన్ భగీరథ అధికారులు ఐటీడీఏ ఇన్చార్జి పిఓ జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడితో సమావేశమయ్యారు. చెంచు పెంటలలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రూ. 18 లక్షలు విడుదల చేస్తున్నామని.. వాటిని తీవ్ర మంచినీటి సమస్యలు ఉన్న ఆదివాసి పెద్దలలో మరమ్మత్తుల చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పిఓ సూచించారు.
అక్కడ పులుల సంచారం..
ఈ నేపథ్యంలో రాయలేట్‌పెంటలో గతంలో అక్కడ చెంచులు ఉన్న విషయం వాస్తవమేనని కొన్ని అనివార్య కారణాలవల్ల వారందరూ వటవర్లపల్లి గ్రామానికి తరలి వెళ్లారని తిరిగి ఇటీవల కొందరు నివాసాలు ఏర్పాటు చేస్తున్నారని పై పెంటలో తాగునీటి సమస్య పరిష్కార విషయంపై పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని.. అందుకు ప్రధాన కారణం అదే ఏరియాలో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉంటుందని మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పిఓ సూచన చేశారు. మా అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోరాదని సూచించారు.