- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ ఏ హోదాలో హామీ ఇచ్చారు?: మంత్రులు పువ్వాడ, ప్రశాంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ ఆరోపించారు. కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదనే విషయాన్ని సాక్షాత్తు పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ లో ఏమైనా మార్పు వస్తుందని అనుకున్నామని, కానీ ఖమ్మం సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అది నిజం కాదని అనిపిస్తోందని అన్నారు. దేశమంతా రాహుల్ ను పప్పూ అంటుంటే బాధేసిందని.. కానీ ఖమ్మం సభ చూశాక అది నిజమేనని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాహుల్ కు ఏమాత్రం రాజకీయ అవగాహన లేదని అన్నారు. టీపీసీసీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని చెప్పారు. అసలు రాహుల్ ఏ హోదాలో పెన్షన్ హామీని ప్రకటించారని ప్రశ్నించారు.
Read More: సీఎంఆర్.. గోల్ మాల్!