ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి మంత్రులు.. కీలక విషయాలు వెల్లడించిన జూపల్లి

by Ramesh Goud |   ( Updated:2025-02-23 13:50:05.0  )
ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి మంత్రులు.. కీలక విషయాలు వెల్లడించిన జూపల్లి
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ( SLBC Tunnel Incident)పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టన్నెల్ లో పరిస్థితిని పరిశీలించేందుకు రెస్క్యూ బృందం (Rescue Team) తో పాటు మంత్రులతో టన్నెల్ లోకి వెళ్లారు. అనంతరం సహాయక చర్యల (Rescue Operation)పై మంత్రి జూపల్లి ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందిస్తూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన.. ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందం (NDRF Team)తో కలిసి టన్నెల్ లోకి వెళ్లడం జరిగిందని, ఇట్టి పరిస్థితుల్లోనూ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం (Government) తీవ్ర ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలియజేశారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్ర‌మాదం విషయంలో మాన‌వ త‌ప్పిదం కానీ, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కానీ లేదని, ఆక‌స్మాత్తుగా సొరంగంలో మ‌ట్టి, నీరు చేర‌డం వ‌ల్లే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిందని చెప్పారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని, ఎన్డీఆర్ఎఫ్, డిజాస్ట‌ర్ మెనేజ్మెంట్ సైనిక బృందాల ఆధ్వర్యంలో ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయని వివరించారు. అంతేగాక అడ్డంకులు అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెల‌కొంది అని చెప్పారు.

ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైందని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారని తెలిపారు. ఇక సాగునీటి పారుద‌లశాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తో క‌లిసి హుటాహుటిన సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని నిన్న‌టి నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నామని జూపల్లి వెల్లడించారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లా (Nagarkurnool District) ఆమ్రాబాద్ మండలం (Amrabad Mandal)లో శ్రీశైలం ఎడమ కాలువ (Srishailam Left Canal) సొరంగం కొన్ని మీటర్ల మేర కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే పనికి వెళ్లిన కొందరు కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. వారికి బయటికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story