- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకో: మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై చేసిన ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడు బిడ్డా అని హెచ్చరించారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు కేంద్రం ఇచ్చిన గణాంకాలు నయా పైసాతో సహా వివరించినా.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్దిపై విషం చిమ్ముతున్నారని, బీజేపీ నాయకులు రాసిచ్చిన పాత స్క్రిప్ట్‌నే ఎన్ని సార్లు చదువుతావంటూ నిలదీశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12వేల కోట్లు ఖర్చు పెడితే.. కేంద్రం ఇచ్చింది 1200 కోట్లు మాత్రమే అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో నిర్మిస్తున్న 1,59,372 ఇండ్లకు, ఇంటికి లక్షా50 వేల చొప్పున 2,390 కోట్లు ఆర్థిక సహాయం చేస్తామని మంజూరీ ఇచ్చి.. ఇప్పటి వరకు కేవలం 1,201 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటిని 8,65,000 వ్యయంతో నిర్మిస్తుండగా పీఎంఏవై ద్వారా లక్షా 50వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ సగం నిధులు మాత్రమే విడుదల చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కోసం కేంద్ర బీజేపీ, మోడీ ప్రభుత్వం కాగితాల మీద లక్షా 21వేల కోట్లు మంజూరు చేసి.. 9ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 19 వేల కోట్లు మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుంచి టోల్ టాక్స్, సెస్‌ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలేనని, కేంద్రం తన జేబులోంచి ఇచ్చింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగితాల మీద లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పాలిట వరంగా మారిన ధరణిని రద్దు చేసి.. మళ్ళీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనేది బీజేపీ ఆలోచనా అని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి : HYD: హైదరాబాద్ కాపు నేతలకు సీఎం కేసీఆర్ కీలక హామీ