Uttam Kumar: ప్రాజెక్టులపై శాసనసభలో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటనలు

by Ramesh N |
Uttam Kumar: ప్రాజెక్టులపై శాసనసభలో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు లోని ప్యాకేజీ 19 ఏ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. ప్యాకేజీ 17,18,19 లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం (TG Assembly) శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు చేశారు. ప్యాకేజీ 19 ఏ ఉద్దేశించిన 39 వేల ఎకరాలు పెద్దారెడ్డి పేట ఎత్తిపోతల పథకం కిందికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సింగూర్ రిజర్వాయర్ నింపేందుకు ఆర్థిక అలైన్మెంట్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. పెద్దారెడ్డి పేట ఎత్తిపోతల పథకం సర్వే అంచనాలు రూపొందిస్తున్నామని, అంచనాలు రాగానే తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.

వెంగళరావు‌సాగర్ ప్రాజెక్ట్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బసమేశ్వర,సంఘమేశ్వర ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయలేదని విమర్శించారు. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గలకు సంబంధించిన ఆ రెండు ప్రాజెక్ట్‌లు, లింక్‌లు చెపడతామని శాసనసభలో తెలిపారు.

Advertisement

Next Story