TG Govt: లబ్ధిదారులకు BIG అలర్ట్.. ఆ లిస్టు ఫైనల్ లిస్ట్ కాదని ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-23 09:48:08.0  )
TG Govt: లబ్ధిదారులకు BIG అలర్ట్.. ఆ లిస్టు ఫైనల్ లిస్ట్ కాదని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధ్యయన కమిటీపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డు(Ration Card)లు ఇస్తాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి భరోసా ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్(BRS) కేవలం 40 వేల రేషన్‌ కార్డులు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. కానీ తాము లక్షల్లో ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ లిస్ట్ కాదని.. కేవలం వెరిఫికేషన్ మాత్రమే స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు(indiramma illu), రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతం ఉంటుందని.. ఐదేళ్ల పాటు దరఖాస్తులను పరిశీలించి ఇస్తామని తెలిపారు. కృష్ణా జలాలపై కూడా అబద్ధాలు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అన్యాయంగా మనకు రావాల్సిన నీళ్లను.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాళ్లకి అప్పగించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్‌ కార్డుల జారీపై గ్రామాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి.. ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. ఈనెల 26న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి.. అర్హులందరికీ అందే వరకూ కొనసాగిస్తామని వెల్లడించారు. సామాజిక ఆర్థిక సర్వే, ప్రజా పాలన దరఖాస్తులు, కులగణనతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed