ఎన్నికల సంఘం అధికారులపై మంత్రి ఉత్తమ్ సీరియస్

by Disha Web Desk 9 |
ఎన్నికల సంఘం అధికారులపై మంత్రి ఉత్తమ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సంఘంపై రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. మోడీ ఈ విధంగా మాట్లాడినా ఈసీ చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని, చీఫ్ సెక్రటరీకి కూడా ఇన్ఫామ్ చేశామని తెలిపారు. ఎమ్‌ఎస్‌పీ ధర ప్రకారం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన ధాన్యం కన్న మేము ఎక్కువ కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు అనేది అత్యవసర విషయమన్నారు.

కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదించి తాగునీటి కోసం కృష్ణానది జలాలు 2.25 టీఎంసీ తెలంగాణకు కర్ణాటక ఇవ్వనుందని తెలిపారు. కొందరు మిల్లర్లు తరుగు తీస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. NDSA సూచనల ప్రకారం ముందుకు వెళ్తున్నామని, రైతులకు ఏ విధంగా నష్టం జరిగిన నష్టపరిహారం తప్పక కల్పిస్తామని, రాష్ట్ర చరిత్రలో కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు గతంలో ఎప్పుడు చేయలేదని పేర్కొన్నారు. రైతు బంధు ఇవ్వనప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు అని మొత్తుకున్నరని, ఇస్తే ఎందుకు ఇస్తున్నారు అంటున్నారని, BRS రైతు బంధు ఇచ్చినప్పుడు బీజేపీ ఎందుకు అబ్జాక్షన్ చెప్పలేదు అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కేంద్రంలోకి వస్తే రిజర్వేషన్ కొనసాగించడంతో పాటు 50 శాతం సీలింగ్ ఎత్తివేస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.

Read More...

మన గొంతును మనమే కోసుకోవద్దు.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

Next Story