- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజకీయ ఉనికి కోసమే గులాబీ లీడర్ల విమర్శలు.. మంత్రి తుమ్మల సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల పేరుతో ఓట్లను దండుకున్న బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రుణమాఫీని అరకొరగానే అమలు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెల రోజుల వ్యవధిలోనే మూడు ఫేజ్‌లలో సంపూర్ణం చేసిందని మంత్రి తుమ్మల వివరించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లక్ష రూపాయల వరకు రుణాలున్న రైతులకు విడతలవారీగా మాఫీ చేసిందని, మొత్తంగా రూ. 28 వేల కోట్లను ఖర్చు చేసిందని, తాము మాత్రం అధికారంలోకి వచ్చిన 8 నెల్లలోనే రూ. 18 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి తుమ్మల ఓ ప్రకటన ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు వివరించి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ప్రజలకు దూరమైన బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి బదులు అప్పటి చేతకానితనాన్ని, నిర్లక్ష్యాన్ని నిజాయితీగా ప్రజలకు వివరించి హుందాగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి తుమ్మల ప్రస్తావిస్తూ... నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నెల రోజుల్లోపే రూ. 18 వేల కోట్లను రుణమాఫీ పేరుతో రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. గత ప్రభుత్వం మాత్ర, పద్ధతి లేకుండా విడతలవారీగా ఇవ్వడంతో ‘అసలు’ తీరకుండా దానిపైన వడ్డీకే సరిపోయిందన్నారు. ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్‌పై విమర్శలు చేయడాన్ని ప్రజలు చూస్తున్నారని, హుందాగా వ్యవహరిస్తే కనీస స్థాయిలోనైనా గౌరవం దక్కుతుందని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్‌కు వంతపాడుతున్న బీజేపీ :
లక్ష రూపాయల పంట రుణాలున్న రైతులకు మాఫీ చేయడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపసోపాలు పడి విడతలవారీగా సగం మందికి కూడా పంపిణీ చేయలేక రైతుల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. బీజేపీ పెద్దలేమో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పధకానికే ఆలోచన చేయలేదన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంట సీజన్‌లోపే రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వేర్వేరు కారణాలతో మూడు ఫేజ్‌లలో రుణమాఫీ ఫలాలను అందుకోలేకపోయిన రైతులకు ఇకపైన రికార్డులను పరిశీలించి అందజేస్తామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నదని, ఎటూ పాలుపోకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయన్నారు.
బ్యాంకుల నుంచి వివరాలు అందగానే... :
బ్యాంకుల నుంచి వివరాలు అందగానే అర్హత కలిగిన ప్రతీ ఖాతాదారునికి వారి మాఫీ చేసే బాధ్యత ప్రభుతానిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నొక్కిచెప్పారు. ఇప్పటిదాకా కేవలం రెండు లక్షల రూపాయల మేర రుణాలున్న రైతు కుటుంబాలను తగిన ప్రామాణికాలతో నిర్దారించుకుని వారి ఖాతల్లో జమ చేశామన్నారు. రెండు లక్షల్లోపు మిగిలిపోయిన కుటుంబాలకు అధికారుల ద్వారా ఆధారాల ప్రకారం నిర్ధారణ చేసుకుని రానున్న రోజుల్లో ఖాతాల్లోనే జమ చేస్తామని స్పష్టం చేశారు. రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ రుణం తీసుకున్న ఖాతాలకు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రెండు లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని బ్యాంకులకు చెల్లించిన తర్వాత అర్హత బట్టి రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేస్తామన్నారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో వివరాలు టాలీ కాకుంటే రైతుల నుంచి అదనపు వివరాలను సేకరించి అర్హులైతే అందిస్తామన్నారు.
మాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు :
రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే బ్యాంకర్లను ఆదేశించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వకాన్ని, ఇప్పటి ప్రభుత్వ ప్రదర్శించిన పనితీరును ప్రజలు గ్రహిస్తున్నారని ధీమా వ్యక్తం చేస్తూనే పదేండ్లలో రుణమాఫీ కోసం బీఆర్ఎస్ చేసిన ఖర్చును వివరించారు. గత ప్రభుత్వ పెద్దలు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో రైతులకు పెద్దగా జరిగిన ప్రయోజనమేమీ లేదన్నారు. ఆ వివరాలను పరిశీలిస్తే ప్రజలకు కూడా సులభంగానే అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని హుందాగా ప్రవర్తించి ప్రజల్లో ఇప్పుతున్న స్థాయినైనా కాపాడుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి తుమ్మల ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ అమలు...
పరిమితి : లక్ష రూపాయల్లోపు రుణాలున్న రైతులకు
ఫస్ట్ టర్ములో (2014-18) ఖర్చు చేసింది : రూ. 16,143 కోట్లు
నాలుగు విడతల్లో : 2014-15 నుంచి 2017-18 వరకు
ప్రయోజనం ‘అసలు’ అలాగే ఉండిపోయింది. వడ్డీకే సరిపోయింది.
రెండో టర్ములో (2018-23)లో ఖర్చు చేసింది : రూ. 11,910 కోట్లు
నాలుగు విడతల్లో : 2020-21, 2021-22, 2023-24లో
మిగలినపోయిన ఖాతాలు : 20.84 లక్షలు, రూ. 8,579 కోట్లు
రిటన్ అయిన ఖాతాలు : 2.26 లక్షలు, రూ. 1,419 కోట్లు
దిద్దుబాటు చర్యలతో సర్దుబాటు : నిల్
పదేండ్లలో రుణమాఫీకి మొత్తం ఖర్చు : రూ. 28,054 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అమలు ...
పరిమితి : రెండు లక్షల రూపాయల వరకు రుణాలున్న రైతులకు
నెల రోజుల వ్యవధిలోనే : మొత్తం రూ. 17,933 కోట్లు
ప్రయోజనం : ‘అసలు’తో పాటు వడ్డీ కూడా మాఫీ
ఫస్ట్ ఫేజ్ (జూలై 18, 2024) : రూ. 6,034 కోట్లు
సెకండ్ ఫేజ్ (జూలై 30, 2024) : రూ. 6,190 కోట్లు
థర్డ్ ఫేజ్ (పంద్రాగస్టు 2024) : రూ. 5,644 కోట్లు
రిటన్ అయిన ఖాతాలు : 22,000
తిరిగి క్లియర్ చేసినవి : 8,000 (రూ. 44 కోట్లు)