రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త

by GSrikanth |
రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. రేపటి(శుక్రవారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులకు సూచనలు శారు. రూ.6,760 కంటే తక్కువ ధరకు మార్కెట్‌లో ధాన్యాన్ని అమ్మొద్దని రైతులకు మంత్రి సూచనలు చేశారు. సన్ ఫ్లవర్ రైతులు తొందరపడొద్దని కోరారు.

రాష్ట్రంలో పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టు బాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఇక ఉండబోదని భరోసా ఇచ్చారు.

ఈ పరిస్థితిని నివారించి అన్నీ పంటలకు గిట్టు బాటు ధర వచ్చే విధంగా అవసరమై చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించిందని వెల్లడించారు. అంతకుముందు మంత్రి తుమ్మలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. సన్ ఫ్లవర్ రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ ఏడాది సన్ ఫ్లవర్ మద్దతు ధర క్వింటాకు రూ.6,760 గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేక సన్ ఫ్లవర్ రైతులు రూ.5 వేల లోపే అమ్ముతున్నారని గుర్తుచేశారు. ఏకంగా క్వింటాకు రూ.2 వేల మేర రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed